Wednesday, May 1, 2024

ప్ర‌తి నియోక‌వ‌ర్గానికి మేనిఫెస్టో…. పెరుగుతున్న డిమాండ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: రాజకీయ పార్టీల ముందు ఈ ఎన్నికల్లో యువజనసంఘాలు, ఎన్జీవోలు, విద్యావంతులు సరికొత్త డిమాండ్‌ను ఉంచుతున్నారు. కామన్‌ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ మేనిఫెస్టో కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ మొస్తే రాష్ట్ర వ్యాప్తంగా చేసే విధానాలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికతో పాటు నియో జకవర్గాల వారీగా ఏంచేస్తారనే నియోజకవర్గ ఎన్నికల ప్రణాళిక ప్రకటించాలన్న డిమాండ్‌ ఇప్పుడు బలంగా వినబడుతోంది. కామన్‌ మేనిఫెస్టోతో బాధలు తీరడం లేదని, వెనుకబడ్డ ప్రాంతాలు, వెనుకపడేయబడ్డ ప్రాంతాలు ఇంకా వెనుకబాటులోనే మగ్గుతున్నాయని ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతోంది. బలవంతులైన ఎమ్మెల్యేలున్న చోటే డెవలప్‌ అవుతుండగా, ప్రధానంగా రిజర్వుడు నియోజకవర్గాలు అభివృద్ధికి దూరంగానే ఉంటున్నాయి.

కొన్ని నియోజకవర్గాలకే అభివృద్ధి పరిమితం అవుతోంది. ఏ నియోజకవర్గానికి ఏం చేస్తారో రాజకీయపార్టీలు నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేయాలని, నియోజకవర్గ మేనిఫెస్టో లేకపోవడం వల్ల ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమపథకాలు పంచి పరిమితమవుతుండగా.. ప్రజలకు నష్టం జరుగుతోంది. నాయకుల్లో జవాబుదారీతనం లోపిస్తోంది. ఏ రాజకీయపార్టీ అయినా నియోజక వర్గ మేనిఫెస్టో ప్రకటించాలని దీనిద్వారా ప్రజలకు, నియోజక వర్గానికి మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గెలిచిన అభ్యర్థిని కుడా అభివద్ధి విషయంలో ప్రశ్నించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 119 నియోజచ వ్‌ర్గాలు ఉండగా, అభివద్ధి అంటే కొన్ని నియోజకవర్గాలే రోల్‌ మోడల్‌ గా ఉంటున్నాయి. ఇప్పటికీ పెద్దపెద్ద చరిత్ర కలిగిన నియోజకవర్గాలు కూడా అభివద్ధి విషయంలో వెనుకబడి ఉన్నాయి. నియోజకవర్గ మేనిఫెస్టో ద్వారా అన్ని ప్రాంతాల అభివద్ధిపై ప్రభుత్వాలు ఫోకస్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రాజకీయపక్షాల ముందు ఓటర్లు ఉంచుతున్న డిమాండ్లను తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయపక్షాలు ఏమాత్రం అమలుచేస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement