Friday, May 3, 2024

Dead Line – రెండు నెలలే సమయం – హైదరాబాద్ లో డ్రగ్స్, గంజా కనిపించకూడదు, వినిపించకూడదు – పోలీస్ కమిషనర్‌ కొత్తకోట

హైదరాబాద్ – రేవ్, వీకెండ్ పార్టీల పేరుతో డ్రగ్స్‌ను వినియోగం, డ్రగ్ పెడ్లర్స్‌ నెట్‌వర్క్‌పై డేగకన్ను వేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.

పబ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా తక్షణ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు. పబ్స్ అన్నీ కూడా.. నిర్దేశిత సమయానికి మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమయం మించిపోయిప్పటికీ.. పబ్‌ను తెరచి ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

పబ్బుల్లో డ్రగ్స్ కట్టడికి నిరంతరంగా నిఘా పెట్టాలని, దీనికోసం టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు. పబ్స్‌లల్లో యథేచ్ఛగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. రెండే రెండు నెలల్లో హైదరాబాద్‌లో పూర్తిగా డ్రగ్స్ లేకుండా చేయాలని, సిటీలో డ్రగ్స్‌, గంజాయి అనే మాటే వినపడకూడదని కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement