Monday, April 29, 2024

BJP: డేటా అంతా ఉన్నా ఈ ద‌ర‌ఖాస్తు డ్రామాలేంటి…రేవంత్‌ను ప్ర‌శ్నించిన కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – రైతు భరోసా కి కావాల్సిన డేటా ప్రభుత్వం దగ్గర ఉంద‌ని, మళ్ళీ దరఖాస్తు కోసం ఎందుకు తిరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందర గోళం నెలకొందన్నారు. ఆ ఫారం నింపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని, ఇదంతా కాలయాపన కోసమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైద‌రాబాద్ నాంప‌ల్లి బిజెపి రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఇందులో రాజకీయం తప్ప చిత్తశుద్ది లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మ్స్ బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. దరఖాస్తు అవసరం లేకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. రేష‌న్ కార్డు నిబంధ‌న ఎత్తివేయాలి .. రేషన్ కార్డ్ గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఇవ్వలేద‌ని,… లేదని తెలిసిన రేషన్ కార్డ్ జత చేయమనడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసులు ఎవరి మీద నమోదు అయ్యాయో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని గుర్తు చేశారు. 2,500 రూపాయలు ఎవరికి ఇస్తారు? బిపిఎల్ ఫ్యామిలీ కి ఇస్తారా? డేటా ఉంది కదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రజలను తిప్పుకోవడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి తప్ప మరొకటి కాదన్నారు.

ఎక్స్‌ పైర్ అయింది మోడీ కాదు… రాహులే ప్ర‌ధాని మోడీ మెడిసిన్ ఎక్స్పైరీ అయిందని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కిష‌న్ రెడ్డి స్పందిస్తూ, ఆయన ఎప్పుడు వేసుకున్నారో చెప్పాల‌న్నారు.. మోడీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని అన్నారు. రాహుల్ గాంధీ మెడిసిన్ రిజెక్ట్ అయిందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదు… బీఆర్ఎస్ ఓడి పోయిందన్నారు.

సిబిఐ విచార‌ణ‌కు లేఖ ఎప్పుడు రాస్తారో….

- Advertisement -

కాళేశ్వరం విషయంలో అందరూ బాధను వ్యక్తం చేశారన్నారు కేంద్ర మంత్రి. న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ చేయించాలని కోరిని విష‌యాన్ని రేవంత్ కు గుర్తు చేశారు.. కాళేశ్వ‌రం విష‌యంలో కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని , అయితే ఇంత వ‌ర‌కు సిబిఐ విచార‌ణ‌కు మాత్రం లేఖ రాయ‌లేద‌ని విమ‌ర్శించారు… సీఎం గా ఉన్న వ్యక్తి ఎంపి గా ఉన్నప్పుడు ఆధారాలు అన్ని నా దగర ఉన్నాయంటూ బీరాలు ప‌లికారాని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ సీబీఐ కి ఉత్తరం ఎందుకు రాయ‌లేదో వెల్ల‌డించాల‌ని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement