Wednesday, May 1, 2024

తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసింది: అరవింద్

కేంద్ర ప్రభుత్వంపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ చేసిన విమర్శల్ని ఖండించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురిి అరవింద్. తెలంగాణలో కరోనా విజృంభిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కాకుండా కేంద్రంపై నెపం నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తిపై ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించలేదని..ఎంత ఆక్సీజన్ అవసరం, ఎన్ని మందులు కావాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారమే లేదని ఎద్దేవా చేశారు. కేవలం విమర్శించాలన్న ఉద్దేశంతోనే మంత్రులు కేంద్రంపై నెపం నెట్టుతున్నారని.. కరోనా విషయంలో రాష్ట్రం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని…ఐసీయూ బెడ్స్ సరిపోవడం లేదుని…ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారని ధర్మపురి అరవింద ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ కోసం వ్యాక్సిన్ వేసుకొమ్మని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కాని, ప్రచారం కాని చేయలేదని… ఇక కోవిడ్ కేసులు, మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు ఇస్తోందన్నారు. కోవిడ్ చికిత్స కోసం ఆయిష్మాన్ భారత్ ను ఎందుకు అమలు చేయడం లేదు?.. వేరే రాష్ట్రాలు కోవిడ్ కేసులు, ఆక్సీజన్, మందులపై కేంద్రానికి వాస్తవ సమాచారం ఇవ్వడం వల్లే వాళ్లకు సరైన మద్దతు లభిస్తోందని ధర్మపురి అరవింద్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement