Sunday, April 28, 2024

Struggle | భారీ వర్షంలో ముంబై వైపు, దళితుల లాంగ్ మార్చ్.. ఆత్మాభిమాన పోరాటం!

మహారాష్ట్ర జిల్లా సాంగ్లి, తాలూకా మిరాజ్, బెడగ గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలు ఊరు విడిచిపెట్టి ముంబై వైపు కవాతు చేశారు. భారీ వర్షంలోను నీలి జెండాలతో మహిళలు పెద్దఎత్తున “లాంగ్ మార్చ్‌”లో పాల్గొన్నారు. గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్క‌ర్ పేరిట స్వాగత తోరణాన్ని (ఆర్చ్) కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఎం, ఉప సీఎం లను డిమాండ్ చేయనున్నారు. అంబేద్క‌ర్ పేరిట ఉన్న తోరణాన్ని బీజేపీ పాలిత గ్రామ పంచాయతీ నెల క్రితం ధ్వంసం చేసింది. దీంతో గ్రామ పంచాయతీ అంబేడ్కరీయుల మధ్య పోరు సాగింది.

అయితే ముందు గ్రామ పంచాయతీ ఆర్చ్‌కు అనుమతి ఇచ్చింది. కొన్ని రోజుల అనంతరం అది అక్రమమని జూన్ 16న కుల్చారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా అంబేడ్కరీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే దళితులు సమావేశం జరిపి అందులో మంగళవారం సమాజమంత మంత్రివర్గంపై లాంగ్ మార్చ్ చేయనున్నట్లు సామూహిక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆర్చ్ కూల్చివేసిన గ్రామ పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు.

అనేక వినతి పత్రాలు ఇచ్చారు. కానీ పరిష్కారం లభించలేదు. రాష్ట్ర సంరక్షక మంత్రి సురేష్ ఖాడే, ఎం.పి సంజయ్ పాటిల్ పరిపాలనపై ఒత్తిడి తెచ్చారని ఆందోళనకారుల ఆరోపణ. అయితే ఊరి నుంచి మంగళవారం పోలీసు కాపలాతో నిరసనకారులు పిల్లల బెడ్-బట్టలు, నెత్తిపై నిత్యావసర ముల్లెముట్టలతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు అంబేడ్కర్ ఫొటోలతో, నీలి జెండాలను రెపరెపలాడిస్తు ముంబైకి బయలుదేరారు. ఇది తమ ఆత్మాభిమాన పోరాటం. న్యాయం లభించే వరకు తిరిగి తమ ఊరుకి రామని వారి అభిమతము.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement