Sunday, May 5, 2024

TS | కోర్టు తాత్కాలిక బెయిల్​.. తల్లిని చూసేందుకు వచ్చిన రాధాకిషన్​రావు

ఆంధ్ర‌ప్ర‌భ, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ -4గా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిష‌న్ రావును చంచల్ గూడా జైలు నుంచి పోలీసులు ఆదివారం కరీంనగర్ తీసుకువచ్చారు. నగరంలోని సాగర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న త‌న తల్లిని చూసేందుకు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.

దీంతో అత‌డిని భారీ బందోబస్తూ మధ్య తీసుకువచ్చారు. ఆయ‌న సోదరి కరీంనగర్‌లో ఉండడంతో తల్లీని ఆమె సంరక్షణలో ఉంచారు. కాగా, రాధా కిషన్ రావు తల్లి పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక‌.. ఆమెను చూడ్డానికి నాంపల్లి కోర్ట్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయ‌న త‌న మాతృమూర్తిని పరామర్శించి చికిత్సకు కావాల్సిన‌ ఏర్పాట్లను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల‌ని రిక్వెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement