Thursday, October 10, 2024

NLG: అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య

మోత్కూర్, సెప్టెంబర్ 29 (ప్రభ న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన రైతు జినుకల ఐలయ్య (48) అప్పుల బాధతో మనస్తాపం చెంది శుక్రవారం తన పత్తి చేనులోకి వెళ్లి పత్తి చేను కోసం తెచ్చిన (మోనో క్రోటో ఫాస్) పురుగుల మందుల తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఆయనను మోత్కూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా ఐలయ్య మృతిచెందారు. ఐలయ్యకు భార్య పద్మ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కాగా ఐలయ్య 6ఎకరాల వ్యవసాయ పొలం కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నారు. అప్పుల బాధకు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement