Friday, May 3, 2024

ఆ నాలుగు గంటలు..జనసమూహం.. కరోనా వ్యాప్తి చెందే అవకాశం

కరోనా విజృంభిస్తోంది.. కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.. కట్టడి ఎలా? తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్‌ డౌన్‌ నిర్ణయం తీసుకుంది. ముందు కొన్నిరోజుల క్రితం నైట్‌ కర్ఫ్యూ మాత్రమే విధించారు. ఆ తరువాత లాక్‌ డౌన్‌ విధించారు. ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు నిత్యావసరాల కోసం సడలింపు నిచ్చారు. ఇలా పదిరోజుల పాటు- ఉంటు-ందని ప్రకటించారు. లాక్‌ డౌన్‌ విధించడం సంతోషమేనని అందరూ అన్నారు. అయితే లాక్‌ డౌన్‌ విధించి ఐదు రోజులు గడిచిపోయింది. లాక్‌ డౌన్‌ ను అధికారులు పకడ్భందీగా అమలు చేస్తున్నారు. ఇంత వరకు సంతోషమే. కానీ ఆ నాలుగు గంటల సడలింపు కొంపముంచేలా కనిపిస్తోంది. అత్యవసరాలు, నిత్యావసరాల కోసం ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు సడలింపు నిచ్చారు. అన్ని దుకాణాలు తెరిచే ఉంటు-న్నాయి. కానీ నాలుగు గంటల్లో కొనుగోలు చేసుకొని వెళ్లాలనే తపన కావొచ్చు.. తొందరగా వెళితే సరిపోతుందనే ఆలోచన ఉండొచ్చు.. కానీ ఆసమయంలో ప్రతిఒక్కరూ రోడ్లపైకి రావడంతో జనసమూహంగా మారుతోంది. కిరాణా దుకాణాలు, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు-, పాలు, పండ్ల దుకాణాలు తదితర షాపుల వద్ద గుంపులు గుంపులుగా చేరుతున్నారు.

లాక్‌ డౌన్‌ ను చూస్తున్నారే తప్పా కరోనా వ్యాప్తిని ఆలోచించడం లేదు. ప్రతి ఒక్కరూ నాలుగు గంటల్లోనే క్రయవిక్రయాలు జరపాలనే ఆలోచనతో ఒకరిపై ఒకరు ఎగబడి కొనుగోళ్లు చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ, హుజుర్‌ నగర్‌, దేవరకొండ, నేరేడుచర్ల, నకిరేకల్‌, యాదగిరిగుట్ట, చౌటు-ప్పల్‌, హాలియా, తిరుమలగిరి తదితర పట్టణ ప్రాంతాల్లోని దుకాణ సముదాయాల వద్ద జనం రద్దీ కనిపిస్తోంది. లాక్‌ డౌన్‌ విధించిన 5రోజుల్లో కూడా జనం గుంపులు తగ్గడం లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి కూరగాయల మార్కెట్లో కొన్నిరకాలు కొనుగోలు చేస్తే మళ్ళీ నాలుగైదు రోజులు అటు-వైపు వెళ్లే అవసరం ఉండదు. కానీ ప్రతి మార్కెట్లలో జనసంచారం విపరీతంగా ఉంటు-ండటం మాత్రం అంతుచిక్కడంలేదు. అయితే లాక్‌ డౌన్‌ తో కరోనా వ్యాప్తిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతుంటే ఆనాలుగు గంటల్లో మాత్రం వ్యాప్తి జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆసమయంలో కూడా కొంత కట్టడి చేస్తే బాగుంటు-ందని అంటు-న్నారు.

ఇదిలా ఉంటే లాక్‌ డౌన్‌ ను మాత్రం కట్టు-దిట్టంగానే అమలు చేస్తున్నారు. పదిగంటలు దాటితే పోలీసులు షాపులు మూసివేయించడం.. రోడ్లపై జనం లేకుండా పంపుతున్నారు. మరీ సమయం దాటి రోడ్లపై తిరిగితే వాత పెడుతున్నారు. వారిని ఏమనకుండానే పెద్ద ఎత్తున ఫైన్‌ లు వేయడంతోపాటు- కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈఐదు రోజుల్లో వేల జరిమానాలు విధించినట్లు- పోలీసులు అధికారులు చెపుతున్నారు. ఏది ఏమైనా కరోనా కట్టడికి లాక్‌ డౌన్‌ విధించడం సరైన మార్గమే అయినప్పటికీ నాలుగు గంటల సడలింపు కొంపముంచేలా కనిపిస్తుంది. పోలీసులు ఆవైపు దృష్టి సారించడంతో పాటు- జనం కూడా గుంపులుగా లేకుండా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement