Friday, May 17, 2024

అంబేద్కర్ వర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగి చేతివాటం.. 3.25 లక్షలు సొంతానికి మ‌టాష్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగి తన చేతివాటం చూపించారు. యూనివర్సిటీలో విద్యార్థులు రీ అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం వారి నుంచి 3 లక్షల 25 వేల రూపాయలను కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి వసూలు చేసినట్లు సమాచారం. ఆ వసూలు చేసిన డబ్బులను యూనివర్సిటీకి చెల్లించికుండా తన సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement