Sunday, April 28, 2024

Congress Vijayabheri – రాహుల్ కొండగట్టు పర్యటన రద్దు – నేటి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు

కరీంనగర్ – తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సుయాత్ర జోరుగా సాగుతోంది. కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలతో రాహుల్ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కాగా.. ఈరోజు రాహుల్ గాంధీ షెడ్యూల్లో ఆఖరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ వి పార్క్ నుంచి నేరుగా జగిత్యాలకు రాహుల్ వెళ్లనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి రాహుల్ వెళ్లాల్సి ఉండగా…ఆ పర్యటన రద్దు అయ్యింది.

జగిత్యాలకు వెళ్లే మార్గమధ్యలో చొప్పదండి నియోజకవర్గం గంగాధర వద్ద రాహుల్‌కు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘనస్వాగతం పలకనున్నారు. జగిత్యాల మీటింగ్ తర్వాత నేరుగా నిజామాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించనున్నారు. మార్గమధ్యలో కోరుట్ల వేములవాడ నియోజకవర్గంలో కార్యకర్తలకు రాహుల్ అభివాదం చేయనున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో లంచ్ బ్రేక్ తర్వాత ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement