Sunday, April 28, 2024

Congress Third List – కామారెడ్డిలో కెసిఆర్ తో రేవంత్ రెడ్డి ఢీ… నీలం మధుకి పటాన్‌చెరు టికెట్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే మూడో అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసింది. 16 మంది అభ్యర్థులతో కూడిన 3వ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీకి రేవంత్ రెడ్డి సై అన్నారు. రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి కూడా కాంగ్రెస్ బ‌రిలోకి దింపింది. ఇప్ప‌టికే ఆయన కోడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి నుంచి ఎన్నికల్లో పోటీకి వెనుకడుగు వేసిన షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్భన్ నుంచి బరిలో దింపారు.

. చెన్నూర్‌ (ఎస్సీ)- డాక్టర్ జీ వివేకానంద

బోథ్‌ (ఎస్టీ)- వెన్నెల అశోక్‌ స్థానంలో గజేందర్‌

జుక్కల్‌ (ఎస్సీ) – తోట లక్ష్మీ కాంతారావు

బాన్సువాడ – ఏనుగు రవీందర్‌ రెడ్డి

- Advertisement -

కామారెడ్డి – రేవంత్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్ – షబ్బీర్‌ అలీ

కరీంనగర్‌ – పురుమళ్ల శ్రీనివాస్‌

సిరిసిల్ల – కొండం కరుణ మహేందర్‌ రెడ్డి

నారాయణఖేడ్‌ – సురేష్‌ కుమార్‌

పటాన్‌చెరు – నీలం మధు ముదిరాజ్‌

వనపర్తి – తూడి మేఘా రెడ్డి

డోర్నకల్‌ (ఎస్టీ)- డా. రామచంద్రు నాయక్‌

ఇల్లెందు (ఎస్టీ) – కోరం కనకయ్య

వైరా (ఎస్టీ) – రామదాస్‌ మాలోత్‌

సత్తుపల్లి (ఎస్సీ)- మట్టా రాగమయి

అశ్వారావుపేట (ఎస్టీ) – జారె ఆదినారాయణ

Advertisement

తాజా వార్తలు

Advertisement