Friday, May 3, 2024

TS : కాంగ్రెస్ న్యాయపత్రం కాదు..అన్యాయ ప‌త్రం.. ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌..

కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం బీజేపీ తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ న్యాయపత్రాన్ని అన్యాయ పత్రంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

ముస్లింలీగ్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందని అన్నారు. బీజేపీది వికాస భారత్ నినాదం.. కాంగ్రెస్ పార్టీది విభజిత భారత్ నినాదమని విమర్శించారు. ఓట్ల కోసమే ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఉచితాలు, గ్యారెంటీ హామీలను నమ్మెద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. హాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రజాకర్శక మేనిఫెస్టో రూపొందించిన బీజేపీ.. ఇందులో ప్రధానంగా 14 హామీలను పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement