Saturday, October 5, 2024

MLC Kavitha: కాంగ్రెస్‌ది అధికారం కోసం అహంకారం…. ఎమ్మెల్సీ క‌విత‌

కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేశారని ఎమ్మెల్సీ క‌విత‌ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి కవిత మహిళల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్‌ది పేగు బంధమని, కాంగ్రెస్‌ది అధికారం కోసం అహంకారమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. ఎన్నికలు ఉన్నాయని ఇతర పార్టీల వాళ్లు అది ఇస్తాము అది ఇస్తామని వచ్చి మాటలు చెప్పి పోతారని, కానీ ప్రజలకు వారు ఏమీ చేయరని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement