Friday, October 4, 2024

Confident – మ‌న‌దే తిరిగి అధికారం…ఎమ్మెల్యేల‌కు కెసిఆర్ భరోసా …

హైదరాబాద్‌: ఎగ్జిట్‌ పోల్స్‌తో పరేషాన్‌ కావొద్దని, మళ్లీ బిఆర్ఎస్సే విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఇవాళ పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని, తిరిగి అధికారం చేప‌ట్టేది తామేన‌ని చెప్పిన‌ట్లు సమాచారం. ఇవాళ, రేపు ఓపిక పడితే 3వ తేదీ సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. 3వ తేదీ ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement