Saturday, May 4, 2024

CM REVANTH: గ్రామాల‌లో ప్ర‌జా పాల‌న స‌దస్సులు – 28 నుంచి ప్రారంభం

హైద‌రాబాద్ – గ్రామ సదస్సులకు ‘ప్రజాపాలన’గా పేరు మార్చారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలన్నారు. కాగా, తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు, యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం సెక్రటేరియేట్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యారు.

సెక్రటేరియేట్‌లోని ఏడో అంతస్తులోని డోమ్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన కలెక్టర్లతో సీఎం సమావేశం కావడం ఇదే మొదటిసారి. పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై సీఎం ఈ సమావేశంలో చర్చించారు. ఈ స‌మావేశంలోనే ప్ర‌జా పాల‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement