Monday, April 29, 2024

Delhi: తెలంగాణ‌కు ఇండియన్‌ స్వచ్ఛత లీగ్ అవార్డులు.. అందుకున్న క‌మిష‌న‌ర్లు, చైర్మ‌న్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రాన్ని మూడు స్వచ్ఛత లీగ్ అవార్డులు వరించాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అలంపూర్‌, కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్‌ స్వచ్ఛత లీగ్ అవార్డులకు కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని తాల్ కటోరా స్టేడియంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ చేతుల మీదుగా సంబంధిత పట్టణాల మున్సిపల్ కమిషనర్లు, ఛైర్మన్లు ఈ అవార్డుల‌ను అందుకున్నారు.

చెత్త రహిత నగరాల్లో భాగంగా ఇండియ‌న్ స్వ‌చ్ఛ‌త లీగ్ అవార్డుల‌ను అందించారు. ఇందులో 15వేలలోపు జ‌నాభా ఉన్న ప‌ట్ట‌ణాల కేట‌గిరీలో అలంపూర్ ఎంపికైంది. 25 నుంచి 50 వేల వ‌ర‌కు జ‌నాభా ఉన్న ప‌ట్ట‌ణాల విభాగంలో ఫిర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, 50 వేల నుంచి ల‌క్ష జ‌నాభా ఉన్న కేట‌గిరీలో కోరుట్ల ప‌ట్ట‌ణాలు ఎంపిక‌య్యాయి. కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ సత్యనారాయణ, వరంగల్, హైదరాబాద్ పట్టణ పరిపాలన శాఖ ప్రాంతీయ డైరెక్టర్లు, ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణ, కోరుట్ల మునిసిపల్ కమిషనర్ అయాజ్, అలంపూర్ మునిసిపల్ కమిషనర్ నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement