Thursday, April 25, 2024

ప్ర‌భుత్వ కార్యాల‌యాలు పరిశుభ్రంగా ఉంచాల‌న్న క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య

ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలని, ఫైళ్ళ నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్రమపద్ధతిలో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పరిపాలనా విభాగంతో పాటు కలెక్టర్ పేసి, తహశీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా సిబ్బంది, అధికారులందరూ సమయపాలన పాటించాలని, ఆన్ లైన్ లో అటెండెన్స్ నమోదు చేయాలని, రెవిన్యూ ఫైల్స్ నిర్వహణ ప్రతి ఫైలుకు క్రమశిక్షణగా స్కాన్ చేసి భద్రపరచాలని, రికార్డ్ రూమ్ సరిగా మెయింటెన్ చేయాలని అధికారులు, సిబ్బంది టేబుల్స్ పై ఏ ఒక్క ఫైలు పెండింగ్ లో పెట్టొద్ధన్నారు.

ఆయా శాఖలపై అధికారులు, సిబ్బంది ఆన్ లైన్ అటెండెన్స్ సరిగా వేస్తున్నారో లేదో ప్రతిరోజూ పరిశీలించాలన్నారు. సంబంధిత నివేదికలను తనకు తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్క అధికారి సిబ్బంది తన విధి నిర్వహణలో కర్తవ్య బాధ్యతను క్రమశిక్షణగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు తహశీల్దార్ మధుర కవి సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement