Sunday, April 28, 2024

TS : చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం…. ఎల్లో, ఆరేంజ్‌ అలర్ట్‌ జారీ

రెండు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు ఎండల‌తో బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా ఉష్టోగ్ర‌త‌లు న‌మోద‌వ్వ‌గా ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్లబ‌డింది. 5రోజుల పాటు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.

- Advertisement -

ప‌స్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉన్నాయి. తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు ఆరెంజ్‌తో పాటు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. అయితే తెలంగాణ‌లో సంగారెడ్డి, మెద‌క్ జిల్లాల‌తో పాటు ప‌లు జిల్లాల్లో ఇవాళ వ‌ర్షం ప‌డింది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement