Friday, November 8, 2024

TS : ఇవాళ సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నేడు సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించ‌నున్నారు. ఉదయం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా దానం నాగేందర్ నామినేష‌న్‌ ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. సాయంత్రం వరంగల్‌లో నిర్వ‌హించే బహిరంగ సభకు హాజ‌ర‌కానున్నారు సీఎం రేవంత్.

- Advertisement -

కాగా, ఇవాళ హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మడికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓరుగల్లు ‘జన జాతర సభ’లో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ అభ్యర్థులు, ఇతర నేతలు హాజరవ్వనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ విపక్షాలపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. పదేళ్లలో ఇటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్.. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేం లేదని మండిపడ్డారు. రెండు పార్టీలు ప్రజలను దోచుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement