Monday, April 29, 2024

CM Revanth Reddy: మాజీ ఆర్బీఐ గవర్నర్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వంతో మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చర్చలు జరుపుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement