Wednesday, May 29, 2024

TS | మూత బడిన చక్కెర ప్యాక్టరీలను తెరిపిస్తాం : ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి

నిజామాబాద్ రూరల్, ప్రభ న్యూస్ : చక్కెర ప్యాక్టరి లు మూత బడినా కేంద్ర ప్రభుత్వం రైతుల పరిస్థితి అర్థం చేసుకోవడం లేదని తాము గెలిస్తే చక్కెర ప్యాక్టరీేలను పున:ప్రారంభిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. బోధన్ మెట్ పెల్లి చక్కెర ప్యాక్టరీలను కపాడుకుంటామన్నారు. రైతులకు తేరాస బీజెపి ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. మార్కెట్ లో కాంప్లెక్స్ ఎరువులు 970 రూపాయలు రేటు ఉండగా 16 వందలు అమ్ముతున్నారని రైతుకు దొంగ దెబ్బ కొట్టే విధంగా ఎరువులు అమ్మడం 70 రూపాయల పెట్రోల్ వంద పది అమ్మడం సమంజసమేనా అని ప్రశ్నించారు.

సోమవారం డిచ్ పల్లి మండలం ధర్మారంలో విద్యాసాగర్ రావు నివాసంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరమ్మ 1971 లో పాకిస్థాన్ తో యుద్ధం ప్రకటించి మెడలు వంచిందని నేడు ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా చేసిందన్నారు. పార్లమెంట్ లో అటల్ బీహార్ వాజ్ పై అపర దుర్గమ్మ అని స్వయంగా పిలిచాడు. ఆమె పై ఉన్న గౌరవం అన్నాడు. ఎం పి అరవింద్ 5 సంవత్సరాలు గడిచినా రైతులకు చేసిందేమీ లేదన్నారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని కనీసం చక్కెర ప్యాక్టరిలు తెరిపించలేదు.

పస్పు బోర్డు మద్దతు ధర అన్నాడు ఎక్కడ పస్ఫు బోర్డు దమ్ముంటే సమాధానం చెప్పు అన్నారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కేసిఆర్ అత్యంత మిత్రుడు రెండు పర్యాయాలుగా పాలించాడు కానీ చక్కెర ప్యాక్టరీలు ఎందుకు తెరిపించ లేదు. కొత్తగా రాజకీయాలకు వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. 21 ప్యాకేజీ పనులు పూర్తి చేస్తే రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. ఎక్కడ పంటలు పండుతున్నాయి. పనులు ఎక్కడి వరకు వచ్చాయి. ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ అటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంతోనే రైతులకు అన్యాయం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్యాకేజీ విషయం పై ముఖ్యమంత్రి తో చర్చించారని అన్నారు.

2014 లో ఏడాదికి రెండువేల ఉద్యోగాలన్నాడు.కనీసం 2లక్షలు కూడా కల్పించలేదు. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంటు కావడం తో తాను నిజామాబాద్ నుండి పోటీ చేయవలసి వచ్చిందని నేను జగిత్యాల బిడ్డను ఇందురు గడ్డ బిడ్డను ఒక్కసారి నన్ను గెలిపించుకోండి అన్నారు. బీడి కార్మికుల ఆడబిడ్డలకు పెన్షన్ కూడా ఇప్పించిన ఘనత కాంగ్రెస్ దేనని యుపిఎ ప్రభుత్వం 2008.9.లో రైతులకు లక్ష రూపాయలు మాఫీ చేసింది కానీ పది సంవత్సరాల కాలం లో ఇంతవరకు ఋణ మాపీ లేదన్నారు. మద్దతు ధరలు లేవన్నారు.

డిసెంబర్ 26 న రైతులకు రుణ మాఫీ చక్కెర ప్యాక్టరీ లు పస్పు బోర్డు ఏర్పాటు మద్దతు ధర ప్రకటించడం మహిళా కళాశాల ఏర్పాటు పై క్యాలెండర్ ను ఏర్పాటు చేస్తాం పనులు చేస్తాం.నేడు కాంగ్రెస్ పార్టీ రైతు పక్ష పాతి అని జీవన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు విద్యాసాగర్ రావు తో పాటు గ్రామస్తులు ఆయనను శాలువాతో సన్మానించారు.జిల్లా అద్యక్షులు మనాల మోహన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు అమృతా పూర్ గంగాధర్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ తహీర్ బిన్ హుందన్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్ ముప్ప గంగా రెడ్డి మాజీ ఎం పీ పీ యాదగిరి రూరల్ అద్యక్షులు ఎల్లయ్య మోపాల మండల అద్యక్షులు రవి తది తరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement