Wednesday, May 8, 2024

Christmas: ఎల్బీస్టేడియంలో క్రిస్మ‌స్ వేడుకలు.. హాజ‌రుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇవాళ‌ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్రార్యక్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఏఆర్ పెట్రోల్ బంక్ కూడలి నుంచి బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలివైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి లేదా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం కూడలి వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ నుంచి సుజాత స్కూల్, చాపెల్ రోడ్డు వైపు పంపిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి బషీర్‌బాగ్ కూడలి వైపు వచ్చే వాహనాలు లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్ నగర్ వైపు పంపిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement