Wednesday, February 21, 2024

Chennur – ముంపు రైతులకు న్యాయం చేస్తాం: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్ ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపుకు గురైన నియోజకవర్గ రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చెన్నూరు నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు అనంతరం గురువారం సాయంత్రం మొట్ట మొదటి సారిగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రనికి వచ్చిన వివేక్ వెంకటస్వామి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో ప్రజలు ఐదు సంవత్సరాల నియంత పాలనకు చరమగీతం పాడారన్నరు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రం గా మార్చారని పేర్కొన్నారు.

నూతన ముఖ్య మంత్రి మొదటి సంతకం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలా ఫైల్ పై చేశారనీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి పట్టం కట్టారన్నారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకొని పరిష్కరించనున్నట్లు తెలిపారు. తమతో పాటు పార్టీ గెలుపు కు కృషిచేసిన నాయకులకు కార్యకర్తలకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement