Monday, June 17, 2024

చలి వేంద్రం ప్రారంభించిన – సీఐ విజ్ఞాన్ రావు

కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్ గ్రామంలో రూరల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో చలివెంద్రాన్ని దుర్షెడ్ స్టేజ్ పై ఏర్పాటు చేసిన చలివేంద్రన్ని సీఐ విజ్ఞాన్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఐ విజ్ఞాన్ రావు మాట్లాడుతూ.. ఎండాకాలం ప్రజల దాహర్తి తీర్చడం కొరకు ఏర్పాటు చేశామని,చలివేంద్రన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచినీరు వృధా గా పోకుండా చూసుకోవాలని అన్నారు.అలాగే యువకులు గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి అలవాటు ద్వారా మత్తులో ఏంచేస్తామో తెలియకుండా జీవితాలు నాశనం అవుతున్నాయి,మీ భవిష్యత్తు కోసం మంచి దారిని ఎంచుకోవాలని నేటి సమాజం మీ చేతులలో ఉంది అని అన్నారు,తదుపరి ఈ కార్యక్రమం లో కరీంనగర్ రూరల్ ఎస్ఐలు శ్రీనివాస్ రావు,లింగ రెడ్డి,దుర్షెడ్ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, సింగల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, మారుతీ రావు,శ్రీరాంమోజు తిరుపతి, నేరెళ్ల శ్రీనివాస్,నవీన్ రావు,ప్రణయ్,రాజు,ప్రవీణ్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement