ఉమ్మడి మెదక్ బ్యూరో – మెదక్ జిల్లా చేగుంట మండలం వడియరం గ్రామంలోని ఎస్ఎల్విఎన్ గార్డెన్ లో జరిగిన జహీరాబాద్ లోకసభ ప్రవాస్ యోజన కార్యక్రమానికి కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మాత్యులు పరుషోత్తం కోదాబాయ్ రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరుషోత్తం రూపాల కు బిజెపి ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు శాలువకప్పి సమావేశానికి ఆహ్వానించారు.
సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి బలోపేతం, రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఎలా కళ్లెం వేయాలనే విషయమై చర్చ కొనసాగుతున్నది..