Wednesday, April 17, 2024

TS: ఓఆర్ఆర్‌పై కారు భీభ‌త్సం… ఇద్దరు మృతి…

నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డులో కారు భీభ‌త్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందకు పడిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు.. అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

ఐదుగురితో వెళుతున్న కారు గచ్చిబౌలి నుంచి శంషాబాద్ కు వెళుతుండగా.. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపైకి రాగానే దారుణ ప్రమాదానికి గురైంది. సమాచారం అందగానే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా యువకులేనని గుర్తించారు. ఐదుగురిలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement