Sunday, April 28, 2024

Banjarahills : కారు బీభ‌త్సం.. ముగ్గురికి తీవ్ర‌గాయాలు

కారు బీభ‌త్సం సృష్టించ‌డంతో ముగ్గురు యువ‌కులు తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఘ‌ట‌న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఇవాళ‌ తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని స్టడీ సర్కిల్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement