Monday, May 27, 2024

TS: గడీలను బద్దలుకొట్టి.. ప్రజాపాలన తెచ్చుకున్నాం.. రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్‌ను బొందపెడతాం
కేసీఆర్, జగదీష్ రెడ్డిని జైలుకు పంపుతాం
పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


ఆంధ్ర్ర‌భ ప్రతినిధి, యాదాద్రి: అవినీతికి పాల్పడి వేల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయమని భువనగిరి లోక్‌స‌భ ఇంచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో జగదీష్ రెడ్డి 10వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని, త్వరలో జైలుకు పంపడం ఖాయమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11మంది ఎమ్మెల్యేలం గెలిచామ‌ని, చేతగాని వారు ఎవ్వరో ప్రజలకు తెలుసని, ఇష్టానుసారంగా మాట్లాడితే జగదీశ్ రెడ్డిని తిరగనియ్యనని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement