Thursday, May 23, 2024

BRS – వ‌రంగ‌ల్ లోక్ స‌భ బిఆర్ఎస్ అభ్య‌ర్ధిగా సుధీర్ కుమార్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా హనుమకొండ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్ ను ఎంపిక చేశారు. ఈ మేర‌కు ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. ఎర్ర‌వెల్లిలోని ఫామ్ హౌజ్ లో నేడు కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న వ‌రంగ‌ల్ జిల్లా నేత‌ల స‌మావేశం నిర్వ‌హించారు.. ఈ స‌మావేశంలో మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాటికొండ రాజ‌య్య తో స‌హా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నేత‌లు హాజ‌రయ్యారు.. సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం సుధీర్ ను ఖ‌రారు చేశారు..

కాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తొలుత కడియం కావ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసినా.. అనూహ్యంగా ఆమె బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగటంతో గులాబీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. అధిష్టానం సైతం ఈ పరిణామంపై సీరియస్‌గా ఉంది. దీంతో వరంగల్‌ ఓటర్లలో గట్టి పట్టు-న్న నేతను బరిలో దించాలని గులాబీ పార్టీ భావించింది. . ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కేటీ-ఆర్‌, హరీశ్‌రావు సేకరించారు. వీరి నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం ఓ నివేదిక తయారు చేసి పార్టీ అధినేత కేసీఆర్‌కు అందజేశారు.

- Advertisement -

నాగూర్‌కర్నూల్‌ సీటు- మాదిగ సామాజిక వర్గానికి, పెద్దపల్లి సీటు- మాల సామాజిక వర్గానికి బీఆర్‌ఎస్‌ కేటాయించింది. దీంతో వరంగల్‌ సీటు-ను మాదిగ సామాజిక వర్గం నేతకే ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇప్పటికే పార్టీకి టచ్‌లో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను తెరపైకి తీసుకొచ్చేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రయత్నాలు చేశారు. మాజీ మంత్రులు హరీశ్‌ రావు, కేటీ-ఆర్‌లను కూడా కలిసి పోటీ-కి అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్టు- ప్రచారం జరిగింది. అయితే పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రం రాజయ్య విషయంలో వేచి చూద్దామంటూ దాటవేస్తూ వచ్చారు. దీంతో ప్రత్యామ్నాయంగా హనుమకొండ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, జనగామకు చెందిన ప్రముఖ వైద్యుడు సుగుణాకర్‌రాజు, కేయూ ఉద్యోగి పుల్లా శ్రీను, బోడా డిన్నా తదితర పేర్లను అధిష్టానం పరిశీలించారు. చివరకు సుధీర్‌కు కన్ఫామ్ చేశారు. అత‌డి గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి హరీష్‌ రావుకు అప్పగించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement