Monday, April 29, 2024

Financial: 51 పేజీల‌తో ఆర్థిక ప్ర‌గ‌తి పేరుతో డాక్యుమెంట్ విడుద‌ల చేసిన బిఆర్ఎస్

హైద‌రాబాద్ – తెలంగాణ ఆర్థిక పరిస్థితి, తొమ్మిదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా ప్రభుత్వాని కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓ డాక్యుమెంట్ ను రిలీజ్ చేసింది.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సాధించిన ఆర్థిక ప్రగతి, మాజీ కేసీఆర్ సృష్టించిన ఆస్తుల వివరాలను అందులో పొందుపరిచింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఈ డాక్యుమెంట్ ను విడుదల చేసింది. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ ఇందులో పేర్కొంది. 2014తో పోల్చితే 2023 నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో గణాంకాలతో సహా బీఆర్ఎస్ ఈ డాక్యుమెంట్ లో వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement