Sunday, May 26, 2024

Minister Sithakka: బీఆర్ఎస్ పేదలకు ఒక్క ఇండ్లు కట్టియ్యలేదు.. వాళ్లు ఉండ‌డానికి ఖ‌రీదైన బంగళాలు…

బీఆర్ఎస్ పభుత్వం కేవలం వాళ్ళు ఉండడానికి ఖరీదైన బంగళాలు నిర్మించుకున్నారు కానీ.. పేదలకు ఒక్క ఇండ్లు కట్టియ్యలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క దుయ్యాబ‌ట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో ఆమె విలేఖ‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

ఉద్యమకారులు నోరు నొక్కిందని అన్నారు. మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెడితే కొందరు నాయకులు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండ రాంకు ఎమ్మెల్సీ ఇస్తే ఓర్వలేక కేసు వేశారని అన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికింది ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ అన్నారు. సీఎం హోదాలో మొదటి సభ కూడా ఇక్కడే నిర్వహించనున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ పేర్లతో మోసం చేస్తే, తాము ఉద్యోగాల కల్పన చేశామన్నారు. ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామన్నారు. ఇంద్రవెల్లి పోరాటంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రక్త హీనత సమస్య ఎక్కువగా ఉందని, అంగన్ వాడి కేంద్రాలు లేవన్నారు.

కడెం ప్రాజెక్టు ను గత ప్రభుత్వం మరిచిపోయిందని అన్నారు. కడెంకు నిధులు కేటాయించి పునరుద్దరణ పనులు చేపడుతామన్నారు. జీతాలు ఇవ్వడానికి కనీసం బడ్జెట్ లేని పరిస్థితి అని తెలిపారు. ఆదివాసి గుడాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ప్రజల సెంటిమెంట్ వాడుకుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వదిలి బీఆర్ఎస్ అవినీతి కోసం కాళేశ్వరం చేపట్టిందని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement