Monday, April 29, 2024

BRS Party Road Show – కాంగ్రెస్, బీజేపీల విష ప్రచారాలను నమ్మవద్దు – ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)28; నిజామాబాద్ పట్టణం అభివృ ద్ధిలో మరింత దూసుకెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ గుప్తాను గెలిపించకుందామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గణేష్ గుప్తాను గెలిపించు కుందాం….నిజామాబాద్ ను కాపాడుకుందామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు మద్ధతుగా నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో కవిత పాల్గొని మాట్లాడారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నిజామాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని తెలి పారు. ఐటీ హబ్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చామని, దాంతో దాదాపు 1500 మందికి ఉపాధి లభిస్తోందని అన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్ కు మరిన్ని ఐటీ పరిశ్రమలు వస్తామని తెలిపారు.


కర్నాటకలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధికారంలోకి వచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ పై సంతకాలు చేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శాంచారు. పోలింగ్ కు ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తారని, తప్పుడు మాటలు మాట్లాడుతారని, వాటికి మోసపోవద్దని కోరారు. ఎన్నికల ప్రచారం ముగిసిందని, ఇక ప్రతిపక్షాల విష ప్రచారం ప్రారంభమవుతుందని, కాబట్టి విష ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కల్పవృక్షం వంటి సీఎం కేసీఆర్ నీడలో రాష్ట్ర అద్భుతంగా అభివృద్ధి అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే తులసి వనంలో గంజాయి మొక్కలా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అవుతానని చెప్పకుం టున్నారని, ఆయన సీఎం అయితే మరొకరు కాలుపట్టి గుంజుతారని, అలా వాళ్లు వాళ్లు కొట్లాడుకోవడమే ఉంటుంది కానీ ప్రజల కోసం పని చేసే ఆలోచన కాంగ్రెస్ నాయకల్లో లేదని ధ్వజమెత్తారు.

55 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు కనీసం కరెంటు, పెన్షన్లు, తాగునీళ్లు కూడా ఇవ్వలేకపోయందని అన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది..

దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దని తెలిపారు. “రాహుల్ గాంధీకి సవాలు చేస్తున్నాను. ఆయన చేస్తున్న తప్పుడు ప్రచారం నిజం కాదని తేలితే రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఒకవేళ ఆయన చెప్పింది నిజమంటే నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు 22 వేల కంపెనీలను తీసుకొచ్చి దాదాపు 30 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించామని, నిజామాబాద్ కు ఐటీ హబ్ కు తీసుకొచ్చి 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు.
బీడీ కార్మికులతో సహా అన్ని రకాల పెన్షన్లను రూ. 5 వేలకు పెంచాలని, కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం పేరిట నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రేషన్ కార్డులను సరిదిద్ది కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత రైతు బీమా తరహాలో పేదలకు రూ. 5 లక్షల మేర కేసీఆర్ రక్ష పేరిట బీమా పథకాన్ని అమలు చేస్తామని, రూ. 15 లక్షల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకునే సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు మొత్తం రూ. 16 వేలకు పెరుగుతుందని, ఎన్నికల తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రూ. 400 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.

- Advertisement -

ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం గృహ లక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. గణేష్ గుప్తాను ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ను కాపాడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గణేష్ భిగాల, నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బిఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement