Tuesday, May 21, 2024

BRS party – నేడు కెసిఅర్ సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో నేడు ప్రజా ఆశీర్వాద సభలు

సిద్దిపేట – ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ముందుగా సిరిసిల్ల బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో, ఆ తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

ఇందుకోసం రెండు పట్టణాలను కేటాయించారు. సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలోని విశాలమైన స్థలంలో బీఆర్ ఎస్ పార్టీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల కటౌట్లతో సిరిసిల్ల పట్టణం గులాబీమయమైంది. జిల్లా నలుమూలల నుంచి లక్ష మందిని తరలించాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ముఖ్య నేతలంతా సీఎంకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లలో చేరారు.

నాగదేవత గుడి నుంచి సిరిసిల్ల వైపు వెళ్లే బైపాస్ రోడ్డులోని మైదానంలో భారీ బహిరంగ సభకు వేదికను ఏర్పాటు చేశారు. సభా వేదికను గులాబీ రంగు వస్త్రాలతో అందంగా అలంకరించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సభా స్థలం, పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. జనసమీకరణ లక్ష్యంగా మండల, గ్రామాలకు ఇన్ చార్జిలను నియమించారు.

ఎన్నికల నగారా మోగిన అనంతరం సిద్దిపేటలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభకు పార్టీ నేతలు, శ్రేణులు హాజరుకానున్నారు. ప్రజా ఆశీర్వాద సభకు పెద్దఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు సభా వేదిక, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభమవుతుందని పార్టీ నేతలు వెల్లడించారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సిద్దిపేట నేల బిడ్డ సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. లక్ష మందితో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి 20 వేల మంది యువకులు మోటారు సైకిళ్లపై అసెంబ్లీకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న వాహనాలు, పార్టీ ఏర్పాటు చేసిన వాహనాలపై ప్రజలు తరలివచ్చి సిద్దిపేట పేరును ప్రపంచ పటంలో నిలిపిన సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement