Sunday, May 12, 2024

BRS Party – అభ్యర్ధులకు 15న బి ఫామ్స్ అంద‌జేయ‌నున్న కెసిఆర్…. అదే రోజు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం

హైద‌రాబాద్ – ఈనెల 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణ భ‌వ‌న్ లో స‌మావేశం కానున్నారు.. అదే రోజున ఫారాలను అభ్యర్థులకు స్వ‌యంగా అంద‌జేయ‌నున్నారు.. ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు కేసీఆర్ వివరిస్తారు.
అలాగే పార్టీ మేనిఫెస్టో విడుదల చేయ‌నున్నారు. అనంతరం అదే రోజు హైద్రాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

సిఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు :
16 న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలు
17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలు
18 న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలు

Advertisement

తాజా వార్తలు

Advertisement