Saturday, March 2, 2024

BRS Party – సాయి చంద్, కుసుమ కుటుంబాల‌కు రూ.3 కోట్ల ఆర్ధిక సాయం .. రజనీకి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి – కెటిఆర్

హైదరాబాద్ – టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణం ప‌ట్ల మంత్రి కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల కెసిఆర్ ను ఎంతగానో కలిచివేసింద‌ని,. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం ఆర్ధిక తోడ్పాడుతో పాటు, అన్ని ర‌కాలుగా వారికి అండ‌గా ఉండాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కెటిఆర్ వెల్ల‌డించారు..

హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నార‌ని చెప్పారు.. ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అంద‌జేస్తామ‌న్నారు.. అలాగే కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామ‌న్నారు..

సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి

ఇక సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు.. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని కెటిఆర్ పేర్కొన్నారు.. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement