Monday, June 24, 2024

BRS Party – భారాస అసెంబ్లీ దండు… 54 స్థానాల‌కు ఇన్ ఛార్జీలు నియామ‌కం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భారాస అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల తొలి జాబితాను విడుదల చేసింది. 54 నియోజకవర్గాలకు పార్టీకి సంబంధించిన సీనియర్‌ నాయకులను ఆయా అసెంబ్లీల ఇన్‌చార్జీలుగా అధినేత కేసీఆర్‌ నియమించారు. అనం తరం గురువారం పార్టీ ఇన్‌చార్జిలతో నిర్వహించిన -టె-లికాన్ఫరెన్స్‌ సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు వారందరికి దిశానిర్దేశం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నదని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దు లుగా ముందుకు తీసుకెళ్లా మన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతు న్నారని కేటీ-ఆర్‌ అభిప్రాయ పడ్డారు. భారాస ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు- అడగాలని సూచించారు. ఇందుకోసం 10 సంవత్సరాలలో భారాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇన్‌చార్జిలకు కేటీ-ఆర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రం పదేళ్లలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం ఉందని వెల్లడించారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందు కున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. అసెంబ్లీల వారీగా ఇన్‌చార్జ్‌లు నియమించబడిన వారిపై గురుతర బాధ్యత ఉంటుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటి నుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ, కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నేటి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను తీసుకోవాలన్నారు.

పకడ్బందీ ప్రచారం
టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు పార్టీ ఇన్‌చార్జ్‌లకు పలు సలహాలు, సూచనలు అందించారు. రానున్న 45రోజుల పాటు- నియోజక వర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్‌ కమిటీ-ల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో పార్టీ ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందిం చుకొని అమలు చేయాలన్నారు. కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమా లపైన ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు బాధ్యత అప్పజెప్పిన కార్యక్షేత్రంలో గత పదేళ్లలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోవాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపిన హరీష్‌ రావు ఆ దిశగా 45 రోజుల పాటు- విస్తృతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్ ఛార్జీగా ఎమ్మెల్సీ క‌విత

భారాస అసెంబ్లి ఎన్నికలను వ్యూహాత్మకంగా గెలిచేలా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే అసెంబ్లిd ఇన్‌చార్జీలను ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత 54 స్థానాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, మాజీ చైర్మన్‌లు, పార్టీ నేతలతో పాటు మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. తమ నియోజకవర్గంతో పాటు మంత్రులు మరో నియోజకవర్గం గెలుపు బాధ్యతలు అప్పగించారు. గట్టి పోటీ ఉన్న చోట ఇద్దరు, ముగ్గురిని నియమించారు. ఎమ్మెల్సీ కవితకు రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. బోధన్‌తో పాటు నిజామాబాద్‌ అర్బన్‌ స్థానాలకు ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ కవితను నియమించారు. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండు స్థానాలకు ఇన్‌చార్జ్‌లను కేటాయించారు. కామారెడ్డికి మంత్రి కేటీఆర్‌ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ మరో ఇద్దరు సహా ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలను కట్టబెట్టారు. ఎమ్మెల్యే గంప గోవర్దన్‌తో పాటు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి చోటు కల్పించారు. గజ్వేల్‌లో మంత్రి హరీష్‌ రావు ఇన్‌చార్జ్‌గా మరో ఇద్దరు సహా ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డిలకు చోటు దక్కింది. ఇక జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్‌ రమణతో పాటు మాజీ మంత్రి రాజేశం గౌడ్‌కు బాధ్యతలు ఇచ్చారు. చొప్పదండి స్థానం బాధ్యతలను గంగుల కమలాకర్‌కు అప్పజెప్పారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్కాజ్‌గిరికి శంభీపూర్‌ రాజుకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను ఇచ్చారు. అంబర్‌పేట్‌కు కట్టెల శ్రీనివాస్‌, అడ్వకేట్‌ మోహన్‌రావును నియమించారు. నాగార్జునసాగర్‌కు ఎమ్మెల్సీ కోటిరెడ్డి, రామచంద్ర నాయక్‌కు చోటు దక్కింది. జనగామలో మంత్రి హరీష్‌రావు ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రాజయ్య సహా ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. కంటోన్మెంట్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌, మధిరకు పువ్వాడ అజయ్‌కు అప్పగించారు. మధిరలో సహ ఇన్‌చార్జ్‌గా కోటేశ్వర్‌ రావును నియమించారు. ఎంపీ రంజిత్‌రెడ్డికి చేవెళ్ల, వికారాబాద్‌ స్థానాలకు ఇన్‌చార్జ్‌గా చోటు దక్కింది.
అసెంబ్లిd ఇన్‌చార్జీల రెండో జాబితా ఈ నెల 15న వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు టికెట్‌ ఆశించిన వారికి ఇందులో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ వారి సేవలను ఉపయోగించుకోవాలని చూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement