Friday, May 17, 2024

TS : బీఆర్ఎస్‌కు భ‌విష్య‌త్తులేదు…కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడు.. కిష‌న్‌రెడ్డి

తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌ని, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు లేడంటూ కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి కాంగ్రెస్‌, బీజేపీల‌పై సైట‌ర్లు వేశారు. మెద‌క్ జిల్లా తూప్రాన్‌లో నిర్వ‌హించిన బీజేపీ విజ‌య సంక‌ల్ప యాత్ర‌లో మాజీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావుతో క‌లిసి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయంటూ జోష్యం చెప్పారు.

- Advertisement -

బీఆర్ఎస్ తెలంగాణ‌లో ఒక్క‌సీటు గెల‌వ‌కున్న న‌ష్టం లేద‌ని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలంటూ మండిప‌డ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టేన‌ని కాంగ్రెస్ అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు చేస్తుంద‌ని దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నిక‌ల్లో బీజేపీని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌న్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో 17కి 17సీట్లు గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్‌ని ఇంటికి పంపించ‌డం గ్యారంటంటూ చ‌వాక్కులు పేల్చారు. రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్ళిపోతారంటూ, కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడని సైట‌ర్లు వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీకి ఓటేస్తే వృథా అయినట్టేన‌ని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఇంకో రెండు నెలలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాయకులను గ్రామాల్లో తిరగనియ్యమ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement