Friday, May 17, 2024

Breaking : కెమిక‌ల్ గోడౌన్ లో చెల‌రేగిన మంట‌లు-అదుపుచేస్తోన్న అగ్నిమాప‌క సిబ్బంది

ఓ కెమిక‌ల్ గోడౌన్ లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి గోదాము మొత్తం విస్త‌రించ‌డంతో భారీగా మంట‌లు ఎగసిప‌డుతున్నాయి.ఈ ప్ర‌మాదం హైద‌రాబాద్ బాచుప‌ల్లిలో చోటు చేసుకుంది. కాగా మంటల ధాటికి రసాయన డబ్బాలు పేలిపోతున్నాయి. దీంతో గోదామ్‌ పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement