Sunday, April 28, 2024

Hyd | ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ఓపెన్​.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్) కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే గత శుక్రవారం మొదటి సారి హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే.. నేడు (బుధవారం) ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు రావడంతో తాజాగా ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఒక ఫీటు మేర ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తారు.

అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..

జంట జలాశయాల గేట్లు (హిమాయత్ సాగర్ -2, ఉస్మాన్ సాగర్ – 2 గేట్లు) ఎత్తడంతో దాదాపు 1566 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నందున జలమండలి ఎండీ దానకిశోర్ సంబంధిత అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

- Advertisement -

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు: (సాయంత్రం 6 గంటల వరకు)

పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1761.20 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.472 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1200 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 1350 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 02

ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ వివరాలు:

పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1787.15 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.900 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 3.253 టీఎంసీలు
ఇన్ ఫ్లో :: 800 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 216 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 15
ఎత్తిన గేట్ల సంఖ్య : 02

Advertisement

తాజా వార్తలు

Advertisement