Monday, February 26, 2024

మిడ్ వెస్ట్ గ్రానైట్ లో బాంబు పేలుళ్ళు – ఒకరి దుర్మరణం

కేసముద్రం, సెప్టెంబర్ 13(ప్రభాన్యూస్ ): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లి గ్రామ శివారు మిడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో బాంబు పేలుళ్ళు జరుగగా ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా మరి కొందరికి గాయాలు అయిన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. అర్పణపల్లి శివారు మిడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో గ్రామానికి చెందిన అమిర్ పాషా క్వారీలో జాకీ లేబర్ గా పనిచేస్తున్నాడు

. ఈనేపథ్యములో బుధవారం ఉదయం క్వారీలో భారీ పేలుళ్ళు జరగడంతో బండలకు జాకీ పెడుతున్న అమిర్ పాషా దేహం తునతునుకలై మృతి చెందాడు. కాగా సంఘటన స్థలానికి పోలీసులు చెరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement