Wednesday, June 19, 2024

TS | పెద్దపల్లిలో బోటు షికారు.. త్వరలో ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కేంద్రం పర్యాటకంగా ముందడుగు వేస్తుంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండ్లమ్మ మినీ ట్యాంక్ బండ్ల మార్చి 10 రకాల సౌకర్యాలు కల్పించడంతో ఆహ్లాదకరంగా మారింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారంతో మినీ ట్యాంక్ బండ్ వద్ద త్వరలో బోటు షికారు ప్రారంభం కానుంది.

ఇప్పటికే బోటు పెద్దపల్లి చేరుకోగా ఆదివారం ట్రయల్ రన్ చేపట్టారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున లాన్ ఏర్పాటు లాన్ చేశారు. రాబోయే రోజుల్లో మినీ ట్యాంక్ బండ్ వద్ద మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement