Monday, April 29, 2024

బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు అరెస్ట్

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క‌ర్మ‌న్‌ఘాట్ ఆంజ‌నేయ స్వామి ఆల‌యానికి వెళ్తుండ‌గా ఎల్బీన‌గ‌ర్ టోల్ గేట్ వ‌ద్ద ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘ‌ట్‌కేస‌ర్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. క‌ర్మ‌న్‌ఘాట్ హ‌నుమాన్ టెంపుల్ వ‌ద్ద బీజేపీ త‌ల‌పెట్టిన ధ‌ర్నాకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో టెంపుల్ వ‌ద్ద‌కు వ‌స్తున్న బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement