Friday, February 23, 2024

BJP Campaign – తెలంగాణలో ముగిసిన మోడీ ఎన్నికల ప్రచార పర్యటన – రోడ్ షో తో బిజెపిలో కొత్త జోష్

హైదరాబాద్ -మూడు రోజుల పాటు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎన్నికల సభల్లో మోడీ పాల్గొన్నారు. మూడో రోజున మహబూబాబాద్ ,కరీంనగర్ లలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం హైద్రాబాద్ లో బీజేపీ రోడ్ షోలో మోడీ పాల్గొన్నారు.ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి కాచిగూడ క్రాస్ రోడ్డు వరకు మోడీ రోడ్ షో నిర్వహించారు. మూడు కి.మీ. పాటు రోడ్ షో నిర్వహించారు.

హైద్రాబాద్ లో రోడ్ షో నిర్వహించిన తర్వాత అమీర్ పేట గురుద్వారకు ప్రధాని మోడీ వెళ్లారు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు..

ఆ తర్వాత కోటీ దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement