Sunday, April 21, 2024

BJP Campaign – కెసిఆర్ ను జైలుకు పంపడం … ముస్లీంల‌కు రిజ‌ర్వేష‌న్ లు ర‌ద్దు చేయ‌డం ఖాయంః అమిత్ షా…

ఆర్మూర్ – తెలంగాణాలో తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మంత్రి కెసిఆర్ చేసిన అవినీతి అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపి జైలుకు పంపిస్తామ‌ని చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా..అలాగే తెలంగాణ‌లో కెసిఆర్ ప్ర‌భుత్వం క‌ల్పించిన ముస్లీంల రిజర్వేష‌న్ కోటాను ర‌ద్దు చేస్తామ‌న్నారు..నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ హామీ ఇచ్చారు. పేరుకే కెసిఆర్ పాల‌న అని నిజానికి స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని ఆరోపించారు..

ద‌నిక రాష్ట్రాంగా ఉన్న‌తెలంగాణ‌ల‌ను పదేళ్లలో విధ్వంసం చేశారని చెప్పారు. వ్య‌వ‌సాయ భూముల నుంచి ప్ర‌భుత్వా ఆస్తుల వ‌ర‌కూ బీఆర్ఎస్ నేతలు వదలడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ పై కేంద్రం పన్ను తగ్గిస్తే కేసీఆర్ సర్కారు మాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామన్న ఏకైక పార్టీ బీజేపీనే అని చెప్పారు. కేసీఆర్ సర్కార్ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. తెలంగాణ‌లో ఈసారి తాము అధి్కారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమాను వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement