Thursday, October 3, 2024

Bhupalapalli – చెట్టును ఢీకొన్న కారు .. ఇద్ద‌రు మృతి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల శివారులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి సీరియస్ గా వున్నట్లు సమాచారం. మోగులపెల్లి మండలంలో ఓ వివాహానికి హాజరై అర్థరాత్రి తిరిగి వస్తుండగా కారు చెట్టును ఢీకొంది.. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పూజారి పవన్ (23), సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన చింతల సాయి కిరణ్(23)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement