Sunday, June 23, 2024

TS : బీఆర్ఎస్‌కు భేతి సుభాష్ రెడ్డి గుడ్‌బై

బీఆర్ఎస్ పార్టీని మ‌రో కీల‌క నేత వీడారు. భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు లేఖ రిలీజ్‌ చేశారు. అటు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కు రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి.

లోక్ సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ కు మద్దతు ఇవ్వనున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. కాగా ఉప్పల్‌ అసెంబ్లీ టికెట్‌ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికు కాకుండా మరో వ్యక్తికి ఇచ్చారు కేసీఆర్‌. దీంతో అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగానే ఉంటున్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి….ఇవాళ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement