Tuesday, May 28, 2024

Maharashtra : జంబుల్వాడి లో రోడ్డు ప్ర‌మాదం… ఐదుగురు మృతి..

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీజాపుర్ గుహాగర్ జాతీయ రహదారిపై జంబుల్వాడి ప్రాంతంలో అర్థ‌రాత్రి జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక సమీప ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. అతివేగం, నిద్రమత్తు లేదా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement