Monday, April 29, 2024

TS: మిష‌న్ భ‌గీర‌థ సొమ్ముతో బెట్టింగ్.. ఏఈ అరెస్ట్

మిషన్ భగీరథలో ఏఈ గా పనిచేస్తున్నఉద్యోగి బెట్టింగ్ కోసం ఏకంగా రూ.15 కోట్లు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించాడు. అయతే ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో సస్పెన్షన్ కు గురయ్యాడు. కీసర మండలం మిషన్ భగీరథ ఏఈ రాహుల్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని చెప్పి రూ. 15 కోట్లు డబ్బులు వసూలు చేశాడు. సుమారు 37 మందిని ఇలానే నమ్మించాడు.

అయితే అతనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కీసర పీఎస్ లో కేసు నమోదైంది. ఈ అధికారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న సదరు అధికారి ఏకంగా విదేశాలకు పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కాడు. దీంతో అతన్ని కీసరకు తరలించారు. పోలీసులు ఆఫీసర్‌ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement