Sunday, April 28, 2024

NZB: ఎలుగు బంటి దాడి : ఒకరికి తీవ్ర గాయాలు

సిరికొండ, ఏప్రిల్ 15 (ప్రభ న్యూస్) : ఎలుగుబంటి దాడిలో ఆదివారం రాత్రి సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య గౌడ్ తీవ్రంగా గాయపడ్డట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు అందించిన వివరాల ప్రకారం… మతి స్థిమితం సరిగ్గా లేని బాలయ్య గౌడ్ ఎక్కడెక్కడో తిరుగుతుంటాడని ఆయనకు భార్య, పిల్లలు ఎవ్వరూ లేనట్లు గ్రామస్థులు తెలిపారు. ఆదివారం రాత్రి కొండాపూర్ గ్రామానికి సమీపంలో గల ఉర చెరువు కట్టపై రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయనపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరచినట్లు తెలిసింది.

ఎలుగుబంటి దాడి చేసిన సమయంలో బాలయ్య గౌడ్ అరుపులు, కేక‌లు వేయ‌డంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. భీంగల్, సిరికొండ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి తునికాకు సేకరణ కోసం ప్రజలు తెల్లవారక ముందే తుంపల్లో, కొండాపూర్, పాకాల అడవులకు తరలి వెళుతున్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజుల క్రితం భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన మరొక‌రు దారి తప్పి కొన్ని గంటల పాటు అడవిలో సంచరించినట్లు తెలిసింది. సిరికొండ తుంపల్లి, కొండాపూర్ అడవుల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నందున తునికాకు సేకరణకు అడవికి వెళుతున్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైన ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement