Sunday, April 28, 2024

TS: ‘ర‌జాకార్’ మూవీకి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వండి.. రేవంత్ కు బండి సంజ‌య్ లేఖ‌

క‌రీంన‌గ‌ర్ – రజాకార్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బీజేపీ ఎంపీ, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.. అదేవిధంగా విద్యార్థుల కోసం రజాకార్ సినిమా ప్రత్యేక షోలు వేయించాలని కోరారు. కాగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్‌లో చిత్రబృందంతో కలిసి బండి సంజయ్ రజాకార్ సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ… ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అందరూ ఈ చిత్రాన్ని చూసి ఒవైసీ పార్టీ ఎలాంటిదో తెలుసుకోవాలని హితవు పలికారు.

మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే తమ అభిమతం అని ప్రకటించారు. ఎంత ఖర్చైనా ధైర్యంగా చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణ రెడ్డిని బండి సంజయ్ అభినందించారు. కాగా, యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి అనసూయ కీలక పాత్రలో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement